Earn Money From Home You Click This Link...

Monday, February 23, 2009

ఎవరికీ ఎవరు ....

ఎవరికీ ఎవరు ... ఎవరికోసం ఎవరు .....
ఎవరి కోసం ఎవరిని ఎవరు చంపుతారు ........
ఈరోజు నీ కోసం ఎవరినో చంపిన అతను........
రేపు మరెవరి కోసమో నిన్ను చంపడని నమ్మకమేంటి .......


Thursday, February 19, 2009

ఎలా చెప్పను ..ఏమని చెప్పను ...

ఎలా చెప్పను ... ఏమని చెప్పను ...

అనుక్షణం నీ రూపాన్ని చూడాలనే నా కళ్ళ తో చెప్పనా..
నువ్వు ఎదురుగా వచ్చిన క్షణం కనురెప్ప చాటున దాగవద్దు అని ,,,

ప్రతి నిమిషం నీతో మాటలాడాలనే నా పెదాలతో చెప్పనా..
నువ్వు పలకరించిన క్షణం మవునం తో మూగపోవద్దు అని ,,,

ప్రతి నిమిషం నీ అడుగు లో అడుగు వేయాలనే నా పాదాల తో చెప్పనా..
నీడను చూసి భయపడవద్దు అని ,,,

అనుక్షణం నీ ఊహల తో నిండిన నా మనస్సు తో చెప్పనా ...
నువ్వు చేరువకాలేదని శిలగా మారవద్దు అని ,,,,

ఎలా చెప్పను ..ఏమని చెప్పను ..

నేనంటే ఇష్టపడే నువ్వు కావాలని ...
ఎలా చెప్పను ..ఎవరితో చెప్పను..

నన్ను ఇష్టపడే నీకు తప్పా..........!!!
.
.

Sunday, February 15, 2009

జీవితం.....


మన "జీవితం" సముద్రం వంటిది......
మన ఆశలు అలలు లాంటివి......
చిన్న చిన్న అలలు ఆనందాన్ని ఇస్తే ......
అదే అలలు తన హద్దు దాటితే "సునామీ" అవుతుంది ....