Earn Money From Home You Click This Link...

Thursday, February 19, 2009

ఎలా చెప్పను ..ఏమని చెప్పను ...

ఎలా చెప్పను ... ఏమని చెప్పను ...

అనుక్షణం నీ రూపాన్ని చూడాలనే నా కళ్ళ తో చెప్పనా..
నువ్వు ఎదురుగా వచ్చిన క్షణం కనురెప్ప చాటున దాగవద్దు అని ,,,

ప్రతి నిమిషం నీతో మాటలాడాలనే నా పెదాలతో చెప్పనా..
నువ్వు పలకరించిన క్షణం మవునం తో మూగపోవద్దు అని ,,,

ప్రతి నిమిషం నీ అడుగు లో అడుగు వేయాలనే నా పాదాల తో చెప్పనా..
నీడను చూసి భయపడవద్దు అని ,,,

అనుక్షణం నీ ఊహల తో నిండిన నా మనస్సు తో చెప్పనా ...
నువ్వు చేరువకాలేదని శిలగా మారవద్దు అని ,,,,

ఎలా చెప్పను ..ఏమని చెప్పను ..

నేనంటే ఇష్టపడే నువ్వు కావాలని ...
ఎలా చెప్పను ..ఎవరితో చెప్పను..

నన్ను ఇష్టపడే నీకు తప్పా..........!!!
.
.

5 comments:

  1. బాగుంది. నాకు నేను ఇలా వేసుకునే కోటి ప్రశ్నల మాదిరేనూ ఇవి కూడా. వీటికి సమాధానం దొరకదెక్కడానూ.

    ReplyDelete
  2. very nice one.

    అమ్మాయిల కైనా అబ్బాయిల కైనా ఈ బాధ ఒకటే నేమో...

    కానీ ఎక్కువ శాతం
    అబ్బాయిలు మాత్రం బయటకి తెలిసేటట్టు ప్రవర్తిస్తారు.

    అమ్మయిలేమో ఇలా మౌనంగా తమలో తామే కుమిలిపోతుంటారు.

    కాస్త ఆ వర్డ్ వెరిఫికేషన్ తొలగిద్దురూ... :)

    ReplyDelete
  3. విశ్వ ప్రేమికుడు Garu,
    వర్డ్ వెరిఫికేషన్ తొలగిద్దురూ... annaru kadha..ekkada ardham kaledhu..koncham clear ga cheppandi..

    ReplyDelete
  4. మీ పోస్టులకు వ్యాఖ్య రాసినపుడు కొన్ని ఆంగ్ల అక్షరాలను నిర్ధారణ కోసం రాయమని అడుగుతుంది. దానినే పదనిర్ధారణ లేదా వర్డ్ వెరిఫికేషన్ అంటారు.

    అది వ్యాఖ్యలు రాసే వారికి కాస్త విసుగొచ్చే విషయం. ఎందుకంటే తప్పుగా టైపు చేసినా, టైపు చెయ్యడనికి కాస్త ఎక్క్కువ టైం తీసుకున్నా మళ్లీ ఇంకో పద నిర్ధారణ అడుగుతుంది. దాని అవసరం అంత లేదని నావుద్దేశం.

    ఒక వేళ అది మీరు తొలగించలి అనుకుంటే మీ డాష్ బోర్డుకు వెళ్లి మీ బ్లాగు ---- సెట్టింగులు ---- నొక్కండి. అక్కడ మీకు వరుసగా ప్రాధమిక, ప్రచురణ, ఆకృతీ కరణ, వ్యాఖ్యలు....... మొదలైన ఆప్షన్స్ వస్తాయి.

    అందులో వ్యాఖ్యలు అనే చోట నొక్కండి. అప్పుడు వ్యాఖ్యలకు సంబంధించిన సెట్టింగులు వస్తాయి. అందులో క్రిందినుండి 3 వ ఆప్షన్ పదనిర్ధారణ చూపాలా వద్దా అని అడుగుతుంది. మీరు వద్దు నొక్కండి. తరువాత క్రింద గానీ పైనగానీ ఉన్న సెట్టింగులను సేవ్ చెయ్యి నొక్కాలి. అంతే....

    ఆడవళ్లు చాలా మంది ఇతరులు రాసిన వ్యాఖ్యలను ముందుగా తాముచూసిన తరువాతే అవి ప్రదురిస్తారు. ఎందుకంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా రాసేవారూ ఉంటారు మన బ్లాగరులలో... కనుక అటువంటి సెట్టింగులు చేసుకుంటారు. మీరుకూడా అలా చేయాలంటే అదే పుటలో ( పేజీలో ) క్రిందినుండి 4 వ ఆప్షన్ చూడండి.

    ధన్యవాదాలు.:)

    ReplyDelete