
ఏమనుకోను నిన్నేమనుకోను ......
ఒక్కోసారి నా కోసం వెతుకుతావు ... మరోసారి కళ్ళ ఎదురుగా వున్నా పట్టించుకోవు ...
నీ కంటి పాప నేనే కదా అనుకుంటా ఆ క్షణం ......
నీతో మాటలడాలని ఆశ గా వున్న నాకు అందరితో మాటలాడుతూ నిరాశను మిగులుస్తావు ...
నీ మనసంతా నేనే కదా అనుకుంటా ఆ క్షణం .......
నిన్ను చూడాలని నీతో మాటలడాలని ఆశ గా వున్నా నాకు ప్రతిసారి నిరాశనే మిగులుస్తావు ......
అనుక్షణం నీ రూపాన్ని చూడాలనే నా కంటి పాప కోరే ఓ స్వప్నమా .....
నిరాశతో నిర్జీవంగా మారిన ఈ మనసును మధురమైన నీ పలుకులతో పులకరింపచేయవా ...............