
.... ఓ అందమైన తెల్ల గులాబి ...
ఓక రోజు ఓ అందమైన ఎర్ర గులాబి మరో గులాబిని వెతుకుతూ
ఈ తెల్ల గులాబిని చూసింది....
అందమైన ఆ తెల్ల గులాబీ చెంత చేరాలని ఆశపడింది ...
తన రంగు, సువాసనలతో తెల్ల గులాబిని ఆకట్టుకుంది..
తన జీవితం లోకి రమ్మని ఆహ్వానించింది ...
కాని పాపం తెల్ల గులాబికి వెళ్ళాలని వున్నా రాను అని చెప్పింది ...
ఏందుకు.....
కనీసం స్నేహం చేయమని బ్రతిమిలాడింది...
తెల్ల గులాబీకి స్నేహం చేయాలని వున్నా వద్దు అని చెప్పింది ...
ఏందుకు.....
ఏందుకు..... ఏందుకు..... ఏందుకు.....
అంటే ఏమని చెప్పను...
తెల్ల గులాబీ ,, ఎర్ర గులాబీ తో ఇలా చెప్పింది..
""" నీతో స్నేహం చేస్తే ఎక్కడ నీ ఎరుపు రంగు తగిలి నాకు మచ్చ పడుతుందేమో నని భయం... అని."""
ఈ భయం ఆ ఒక్క తెల్ల గులాబీకే కాదు..
నాకు...నీకు ...మనందరికీ ....
అవును కదా ......
ఇలా ఇష్టపడిన ఎన్ని గులాబీలను MISS అవుతున్నామో ..... కదా...