Earn Money From Home You Click This Link...

Monday, November 2, 2009

ప్రేమతో మీ " ప్రేమ"


ప్రేమ ఈ పదం అంటే ఇష్టపడని వాళ్ళు వుండరు
ఆ పదంలోని మాధుర్యాన్ని ఆస్వాదించని వాళ్ళు వుండరు ..
ప్రేమ ఎన్ని బాంధవ్యాలతో ఎన్ని అనుబంధాలతో వుంటుందో ...

అప్పుడే పుట్టిన పసిపాపాయి కి కావాలి తల్లి ప్రేమ
పెరిగే చిన్నారులకు కావాలి తండ్రి ప్రేమ
చదువుకునే యువతకు కావాలి స్నేహితుల ప్రేమ
పెళ్లి అనే రెండక్షరాలతో కావాలి జీవిత భాగస్వామి ప్రేమ
వృద్ధాప్యంలో కావాలి కన్న బిడ్డల ప్రేమ .......

కానీ స్వార్ధం తో నిండిన ఈ సమాజం లో కొందరు స్వార్ధపరులు మధ్య ప్రేమ ఇలా ఓడిపోతూ వుంది ...


అప్పుడే పుట్టిన పసిపాపాయిని చేరుస్తున్నారు చెత్తకుండి వడిలో , అనాధశరనాలయం ముంగిట్లో ,
ఒక్కప్పటి పసిపాపలం అని మరిచిన తలితండ్రులు ....
సాంప్రదాయాన్ని చంపి స్వార్ధం తో జీవించే ఇలాంటి తల్లితండ్రులు
వున్నంత కాలం ప్రేమ చనిపోతూనే వుంటుంది ......

భవిషత్ ని పూల వనం లా మారుచుకోవలసిన యువత
క్షనికావేశం తో ప్రేమ వున్మాదులుగా మారుతున్నారు ....
ఇలాంటి ప్రేమ వున్మాదుల చేతిలో ప్రేమ వున్మాది లా మారుతుంది ........

కోవతి తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుంది
అలాగే తల్లితండ్రులు తాము క్షినిస్తూ తన బిడ్డలకు జీవితాన్ని ఇస్తారు ..
వృద్ధాప్యంలో వున్న అలాంటి తల్లి తండ్రులకు పిడికిలి అన్నం పెట్టలేక వృద్దాశ్రయంలో చేరుస్తున్నారు ....
రేపటి తల్లితండ్రులం అని మరిచిన కన్నబిడ్డలు .....

ఇలాంటి కన్నబిడ్డలు వల్ల పుత్రశోకంతో ప్రేమ ప్రతిరోజు చనిపోతూనే వుంటుంది ........

కట్నాలు ,వేదింపులు,
అనుమానాలు ,ఆకర్షణలు ,
ఆశలు,ఆవేశాలు ,
స్వార్ధాలు ,కోపాలు ,తాపాలు ...
ఇలా ఎన్నో మరెన్నో ఆయుధాల చేతులలో
ప్రేమ రోజు .. ప్రతిరోజు
క్షణం .. ప్రతిక్షణం హత్య చేయబడుతుంది ........

ఆలోచించండి ... ఒక్కనిమిషం ఆలోచించండి ..
ప్రతి క్షణం నన్ను చంపే స్వార్ధపరులారా ...
ఆలోచించండి ... ఒక్కనిమిషం ఆలోచించండి ..

నాకు బ్రతకాలని వుంది నన్ను బ్రతకనివ్వండి ...

ప్రేమతో ......
మీ ప్రేమ ...



2 comments:

  1. క్షమించండి నేస్తం. ఆలస్యంగా వచ్చాను.
    చాలా బాగుంది. ఆలోచింపచేసే విధంగా ఉంది.

    కొందరి విషయంలో మీరన్నట్టు ప్రేమ మరణించినా...

    అది క్రొంగొత్త రూపంలో ఉదయిస్తుంది.
    నేను ఎప్పటికీ ఉన్నానంటూ తన ఉనికిని చాటుతునే ఉంటుంది.
    చూసే మనసుంటే...

    కురిసే చినుకుల్లో... సంధ్యా సమయంలో.. పసిపాపల నవ్వుల్లో... అంతెందుకు మన బ్లాగరుల రచనల్లో... అది వ్యక్తమౌతూనే ఉంటుంది. :)

    ReplyDelete
  2. విశ్వ ప్రేమికుడు Garu ..Thanks Andi...

    ReplyDelete